ఛత్తీస్‌గఢ్‌ కోర్టు సంచలన తీర్పు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: హత్యాచారం కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఛత్తీస్‌గఢ్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరొకరికి జీవిత ఖైదు విధించింది. బాలికపై సామూహిక అత్యాచారం, హత్యతో పాటు, బాలిక తండ్రిని చంపిన కేసులో దోషులకు ఈ శిక్ష విధించింది. ఈ నెల 15న కోర్బా జిల్లా కోర్టు తీర్పు వెలువరించగా, ఆలస్యంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. అడవిలో పశువులను మేపడానికి వెళ్లిన బాలికపై అయిదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై బాలికను రాళ్లతో కొట్టి చంపారు. బాలిక తండ్రి(60), అతని నాలుగేళ్ల మనుమరాలిని సైతం హత్య చేశారు. ఈ కేసులో నేరం నిరూపితం కావడంతో కోర్టు ఈ మేరకు శిక్ష ఖరారు చేసింది.