అక్షరటుడే, మెదక్ : బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు చికెన్, గుడ్లు కొనుగోలు చేయడానికి భయపడుతున్నారు. దీంతో వ్యాపారులు నష్టపోతున్నారు. ఈ క్రమంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి మెదక్ జిల్లా రామయంపేటలో చికెన్ మేళా నిర్వహించారు. చికెన్ సెంటర్ యజమానులు, సరఫరాదారులు కలిసి పలు రకాల చికెన్ వంటకాలు తయారు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. చికెన్ తింటే బర్డ్ ఫ్లూ రాదని అవగాహన కల్పించారు.