అక్షరటుడే, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలోని ఆమనగల్లు గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని స్పిరిట్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్నేహితురాలు మాట్లాడడం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తోటి విద్యార్థినులు తెలిపారు. విద్యార్థినిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.