అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఉమ్మడి పౌరస్మృతి అమలు దిశగా మరో రాష్ట్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఉత్తరాఖండ్​ ప్రభుత్వం యూసీసీ అమలు చేస్తోంది. తాజాగా గుజరాత్​ యూసీసీ ముసాయిదా తయారీకి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా దేశాయ్​ నేతృత్వంలో కమిటీ వేసింది. ఐదుగురు సభ్యుల ఈ కమిటీ 45 రోజుల్లో నివేదిక ఇస్తుందని, దాని ఆధారంగా చట్టం చేస్తామని గుజరాత్​ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్​ తెలిపారు.