అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ధ్వజస్తంభం ఇనుప కొక్కెం విరిగిపోయింది. కొక్కెం ద్వారానే అర్చకులు గరుడపఠాన్ని ఎగురవేస్తారు. కాగా.. టీటీడీ అధికారులు మరమ్మతులు చేపట్టారు.