అక్షరటుడే, కామారెడ్డి: మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు కంటెయినర్ దగ్ధమైంది. అయితే ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు. అనంతరం కంటెయినర్ ను పెట్రోల్ బంక్ పక్కనే ఖాళీ స్థలంలో పార్కింగ్ చేశారు. అయితే ఉదయం 11 గంటల ప్రాంతంలో కంటైనర్ లో మళ్లీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కంటెయినర్ పూర్తిగా కాలిపోయింది. ఫైర్ అధికారులు చేరుకుని ముందస్తుగా పెట్రోల్ బంక్ సర్వీసులు నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. అయితే మంటలను పూర్తిగా అర్పివేసినా మళ్లీ చెలరేగడం అనుమానాలకు తావిస్తోంది.