అక్షరటుడే, ఇందూరు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలపై ఉమ్మడి జిల్లా అధికారులతో ఆదివారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశం ప్రారంభమైంది. కార్యక్రమానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశిష్ సంగ్వాన్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, లక్ష్మీకాంతారావు, వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, మేయర్ నీతూ కిరణ్, కామారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇందుప్రియ తదితరులు హాజరయ్యారు.