అక్షరటుడే, బోధన్: మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా.. సంగం గ్రామానికి చెందిన గంగాదీపక్, రెంజల్బేస్నకు చెందిన సాయిలు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకున్నారు. సోమవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చారు. అలాగే బహిరంగంగా మద్యం తాగుతున్న మరో ఇద్దరికి, అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై పండ్ల బండి ఏర్పాటు చేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన ఒకరిని కూడా మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా ఈ ఐదుగురికి ఒకరోజు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని పోలీసులు తెలిపారు.