అక్షరటుడే, వెబ్‌డెస్క్: తక్కువ వడ్డీకి హోం లోన్ ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తిని సైబర్ నేరస్తుడు మోసగించాడు. వివరాల్లోకి వెళ్తే.. సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో గుర్తుతెలియని వ్యక్తి పరిచయమయ్యాడు. తక్కువ వడ్డీకి ఇంటి రుణం ఇప్పిస్తానని సదరు వ్యక్తి నమ్మించాడు. దీని కోసం మొదట ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్పాడు. దీంతో బాధితుడు రూ.3500 ఫోన్ పే ద్వారా సైబర్ నేరస్తుడు చెప్పిన నెంబర్‌కు పంపించాడు. ప్రాసెసింగ్ అమౌంట్ కింద మరింత డబ్బు పంపాలని అవతలి వ్యక్తి సూచించాడు. దీంతో విడతల వారీగా రూ.70 వేలు పంపించాడు. తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.