అక్షరటుడే, వెబ్‌డెస్క్: కెనడాలో విమాన ప్రమాదం జరిగింది. 80 మందితో ప్రయాణిస్తున్న డెల్టా ఎయిర్ లైన్స్ జెట్ విమానం టొరంటో విమానాశ్రయంలో కూలిపోయింది. విమానం ల్యాండ్ అవుతుండగా రన్ వేపై మంచు ఉండడంతో తలక్రిందులుగా పల్టీలు కొట్టి కనీసం 17 మంది గాయపడ్డారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.