అక్షరటుడే, వెబ్ డెస్క్:  గుజరాత్‌లోని సూరత్‌లో నకిలీ బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రో-హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ (బీఈఎంఎస్) డిగ్రీ రాకెట్ గుట్టు రట్టయింది. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. 13 మందిని అరెస్టు చేశామని, అందులో 10 మంది నకిలీ వైద్యులు ఉన్నారని తెలిపారు. నిందితుల క్లినిక్‌ల నుంచి అల్లోపతి, హోమియోపతి మందులు, ఇంజెక్షన్లు, సిరప్ బాటిళ్లు, సర్టిఫికెట్లు లభించినట్లు పేర్కొన్నారు.

70 వేలకు పట్టా..

నకిలీ వైద్యులు కాకుండా.. మిగిలిన ముగ్గురు నిందితులు నకిలీ BEMS పట్టాలను ₹70,000కి విక్రయిస్తున్నారన్నారు. ముగ్గురు నిందితులను సూరత్‌కు చెందిన రాసేష్ గుజరాతీ, బీకే రావత్(అహ్మదాబాద్‌), ఇర్ఫాన్ సయ్యద్‌గా గుర్తించారు. ‘బోర్డ్ ఆఫ్ ఎలక్ట్రో హోమియోపతిక్ మెడిసిన్, అహ్మదాబాద్’ పేరుతో గుజరాతీ, రావత్‌లు ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లు మా ప్రాథమిక విచారణలో తేలింది” అని పోలీసులు తెలిపారు.