అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: భిక్కనూరు మండలం జంగంపల్లిలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట చేపట్టారు. గ్రామ రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా ఎస్ఈ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏవైనా విద్యుత్తు సమస్యలుంటే విద్యుత్ సిబ్బందికి లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1912 కాల్ చేసి తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో డీఈ కళ్యాణ్ చక్రవర్తి, దోమకొండ ఏడీఈ సుదర్శన్ రెడ్డి, భిక్కనూరు ఏఈ బాలాజీ, రైతులు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.