అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిర్మల్ జిల్లా భైంసా భక్తులతో కుంభమేళాకు వెళ్తున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ వద్ద బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో కుబీర్ మండలం పల్సి గ్రామానికి చెందిన వృద్ధుడు సజీవ దహనం అయ్యాడు. ఆ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. పలువురికి గాయాలయ్యాయి.