అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ సబ్​స్టేషన్​ కెపాసిటర్ బ్యాంక్​లో మంటలు చెలరేగాయి. దీంతో ట్రాన్స్​ఫార్మర్ సెల్స్ పేలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సబ్​స్టేషన్ అధికారులు ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సబ్​స్టేషన్​కు చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. ఈ విషయమై ఎస్ఈ శ్రవణ్ కుమార్​ను వివరణ కోరగా.. సబ్​స్టేషన్​లో పెద్దగా ప్రమాదమేమీ జరగలేదని, సెల్స్ కొత్తవి అమర్చితే ఇబ్బంది ఉండదన్నారు.