అక్షరటుడే, వెబ్​డెస్క్​ : అమెరికాలోని లాస్​ఏంజిల్స్​లో మరో ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. మొన్నటి వరకు మంటలు వ్యాపించి నగరం బూడిద దిబ్బగా మారిన విషయం తెలిసిందే. ఆ మంటలు పూర్తిగా అదుపులోకి రాకముందే మళ్లీ కార్చిచ్చు మొదలై మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 50 వేల మందిని ఆయా ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని అధికారులు ఆదేశించారు.