అక్షరటుడే, ఆర్మూర్‌ : పట్టణంలోని ఆరో వార్డు అన్నపూర్ణ కాలనీలో సోమవారం ఫాగింగ్‌ యంత్రానికి మంటలు అంటుకుని కాలిపోయింది. దోమల నివారణ కోసం ఉపయోగిస్తున్న ఫాగింగ్‌ యంత్రంలో పెట్రోల్‌, డీజిల్‌ కలిపి ఫాగింగ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా యంత్రంలో మంటలు వచ్చాయి. దీంతో డ్రైవర్‌ వాహనాన్ని జనావాసాలకు దూరంగా తీసుకెళ్లి వదిలేశాడు. యంత్రం పాక్షికంగా కాలిపోయింది.