అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: గ్రామసభలో మాజీ సర్పంచ్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం మొగిలిపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మొగిలిపేట గ్రామంలో తహశీల్దార్‌ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. అందులో మాజీ సర్పంచ్‌ నాగరాజు తనకు రావాల్సిన రూ.18లక్షల బిల్లులు ప్రభుత్వం చెల్లించడంలేదని ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే బాధితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.