అక్షరటుడే, ఇందూరు: రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు గురుకుల పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తోంది. కానీ కొన్నిచోట్ల క్షేత్రస్థాయిలో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలోని ఖిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పట్టణ గురుకుల పాఠశాల ఆవరణలో దుర్వాసన వెదజల్లుతోంది. మూత్రశాలల నుంచి మురికి నీరు బయటికి రావడంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఇబ్బందులు తప్పడం లేదు. విద్యార్థులు రోజంతా దుర్వాసన మధ్య ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.