అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నగరంలోని అహ్మదీ మార్కెట్ లో బుధవారం సాయంత్రం నాలుగేళ్ల బాలుడు తప్పి పోగా, స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు బాలుడి వివరాల కోసం స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న బాలుడి తండ్రి షేక్ రిజ్వాన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని బాలుడి వివరాలు తెలపడంతో బాలుడిని వారికి అప్పగించినట్లు ఎస్ హెచ్ వో యాసిర్ అరాఫత్ తెలిపారు.