అక్షరటుడే ఆర్మూర్: పట్టణంలోని వేంకటేశ్వర కాలనీ ఆలయ ప్రాంతంలో బుధవారం సాయంత్రం హన్సిక అనే బాలికపై కుక్కలు దాడిచేశాయి. బాలిక ఆడుకుంటుండగా అవి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలికను ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్​కు తరలించాలని వైద్యులు సూచించారు. హన్సికతో పాటు మరో ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేసినట్లు తెలిసింది.