అక్షరటుడే, బోధన్: నవీపేట మండల కేంద్రంలో గూడ్స్ ఆటో అపహరణకు గురైంది. బోధన్‌కు చెందిన ముజాహిద్ మేకలు కొనుగోలు చేసేందుకు శనివారం తెల్లవారుజామున అశోక్ లేలాండ్ వాహనంలో నవీపేట మేకల సంతకు వచ్చాడు. ఓ షాపు ముందు పార్క్ చేసి సంతలోకి వెళ్లాడు. కొంతసేపటి తర్వాత దుండగుడు బైకుపై వచ్చి దానిని అక్కడే వదిలేసి గూడ్స్ ఆటోను తీసుకుని పరారయ్యాడు. కాసేపటికి బయటకు వచ్చిన ముజాహిద్ కు తన ఆటో కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నవీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే దొంగ తీసుకువచ్చిన బైకు సైతం చోరీ చేసిందిగానే తెలుస్తోంది.