అక్షరటుడే, ఇందూరు: నగరంలోని ఆర్టీసీ కాలనీ శ్రీ శక్తిమాన్ హనుమాన్ మందిరం వద్ద 12 అడుగుల ఆంజనేయ విగ్రహం ప్రతిష్ఠాపన కోసం బుధవారం భూమి పూజ నిర్వహించారు. గుడి అధ్యక్షుడు, విగ్రహ దాత గుజ్జల హనుమంతు రెడ్డి దంపతులు భూమిపూజలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఫిబ్రవరి 2న ప్రతిష్ఠాపన చేస్తామని గుడి కమిటీ సభ్యులు తెలిపారు.