అక్షరటుడే, వెబ్​డెస్క్​: అన్నమయ్య జిల్లాలో ప్రేమికుల రోజునే దారుణం చోటు చేసుకుంది. గుర్రంకొండ మండలం ప్యారంపల్లెకు చెందిన యువతిపై ఓ ప్రేమోన్మాది యాసిడ్​ పోశాడు. నిందితుడు మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్‌గా గుర్తించారు. యువతి తలపై కత్తితో పొడిచిన నిందితుడు మొహంపై యాసిడ్‌ పోశాడు. స్థానికులు వెంటనే బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఆ యువతికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. దీంతోనే నిందితుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్​ స్పందించారు. బాధితురాలికి అండగా నిలుస్తామన్నారు. యాసిడ్​ దాడిపై ఏపీ హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.