అక్షరటుడే, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్ లో క్యాసినో నిర్వహించారు. మొయినాబాద్‌ పరిధిలో ఉన్న ఈ ఫామ్ హౌస్ లో కోడి పందాలు సైతం జరిగాయి. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఫామ్ హౌస్ పై దాడి చేశారు. ఆర్గనైజర్ భూపతి రాజు శివకుమార్ తో సహా అక్కడ ఉన్న 64 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీగా నగదు, లగ్జరీ కార్లు, 86 పందెం కోళ్ళు, 46 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.