అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అనుసంధానంగా నిర్మించిన సింగితం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీ ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 416.550 మీటర్లు కాగా.. అంతే స్థాయిలో నీరుండగా ఎగువ నుంచి 475 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వచ్చి చేరుతోంది. దీంతో ఒక వరద గేటు ద్వారా నీటిని ప్రధాన కాలువ ఆయకట్టుకు మళ్లిస్తున్నట్లు ఏఈ శివ ప్రసాద్ తెలిపారు. ఇక నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా ఉంది. ఇన్ ఫ్లో లేకపోవడంతో ప్రస్తుతం 3.86 టీఎంసీల నీరు నిల్వ ఉంది.