అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఆంధ్రప్రదేశ్​లో భారీ ఆదియోగి ప్రతిమను ఏర్పాటు చేశారు. ఏపీలోని అంబేడ్కర్​​ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో ఈ అతిపెద్ద ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారు. 60 అడుగుల ఎత్తు.. 100 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ ఆదియోగి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కేవలం 10 నెలల్లోనే ఈ విగ్రహ నిర్మాణం పూర్తి చేయడం గమనార్హం. ఇది భారతదేశంలో మూడవ పెద్దదైన విగ్రహం కాగా.. శివరాత్రిరోజు ఆవిష్కరించనున్నారు.