అక్షరటుడే, ఆర్మూర్ : బాల్కొండ మండలం చిట్టాపూర్ వసంత ఫంక్షన్ హాల్లో నిరుద్యోగ యువతుల కోసం ఆదివారం జాబ్‌మేళా నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎస్కేఎస్ఎస్ కంపెనీ సౌజన్యంతో ప్రముఖ పారిశ్రామికవేత్త, గ్రామానికి చెందిన ఏనుగు దయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గోపాల్ కృష్ణ, ఆర్గనైజర్ రాజ్‌కుమార్, న్యవనంది గణేష్, సందీప్, కేఎన్‌డీ మూర్తి, మల్లేష్ గౌడ్, బీఆర్ నర్సింగ్ రావు పాల్గొన్నారు.