అక్షరటుడే, కామారెడ్డి: పట్టణంలోని పీజేఆర్ స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో ఈనెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ఛైర్మన్ గురువేందర్ రెడ్డి తెలిపారు. టాస్క్ తెలంగాణ అకాడమీ స్కిల్, ఎక్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో ఎటిరో డ్రగ్స్ ఫార్మా కంపెనీ 300 ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. డిగ్రీ పాసయిన అభ్యర్థులు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణ ప్రసాద్, ప్రోగ్రాం ఆఫీసర్ మహేశ్ పాల్గొన్నారు.