అక్షరటుడే, ఆర్మూర్: ఆలూర్ మండలకేంద్రంలో జూనియర్ కళాశాల మంజూరు కాగా.. మంగళవారం డీఐఈవో రవికుమార్ స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట కాంగ్రెస్ మండలాధ్యక్షుడు విజయ్, ఎంఈవో నరేందర్, బాల్కొండ ప్రిన్సిపాల్ రజీవుద్దీన్, రాజేశ్, వీడీసీ అధ్యక్షుడు ముత్యం, బీజేపీ అధ్యక్షుడు గిరీష్, తదితరులున్నారు.