అక్షరటుడే, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ – లావణ్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మస్తాన్ సాయిని అరెస్టు చేశారు. పలువురు అమ్మాయిలతో ప్రైవేట్‌గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలున్నాయి. ప్రైవేట్‌గా గడిపిన వీడియోలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. లావణ్యకు చెందిన కొన్ని వీడియోలను సైతం మస్తాన్ సాయి రికార్డు చేశాడు. ఆ వీడియోలను లావణ్య పోలీసులకు అందజేసింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌లో 200కు పైగా వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.