అక్షరటుడే, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ మల్లారెడ్డి హస్పిటల్ ముందు గ్యాస్ పైప్ లైన్ నుంచి పెద్ద ఎత్తున గ్యాస్ లీకేజీ అవుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలానికి ఎమర్జన్సీ రెస్పాన్స్ టీం చేరుకొంది. లీకవుతున్న పైప్ లైన్ ను పరిశీలిస్తోంది.