అక్షరటుడే, వెబ్‌డెస్క్: తిరుమల కొండపై మరోసారి తేలికపాటి విమానం చక్కర్లు కొట్టింది. శ్రీవారి ఆలయం సమీపంలోనే విమానం తిరిగింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రానికి విరుద్ధమంటూ మండిపడుతున్నారు. దీనిపై ఏపీ హోంమంత్రి అనిత స్పందించారు. గురువారం జరిగిన ఘటనపై సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.