అక్షరటుడే, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం రాట్నెస్ట్ దీవి వద్ద ఒక లైట్ ఎయిర్క్రాఫ్ట్ టేకాఫ్ సమయంలో సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రైవేటు యజమాన్యాయానికి చెందిన సెస్నా 208 కారవాన్ విమానం.. రాట్నెస్ట్ దీవి, ప పెర్త్ నకు 30 కి.మీ (18.6 మైళ్లు) దూరంలో ఉన్న పర్యాటక ప్రాంతం వద్ద నిన్న సాయంత్రం 4 గంటలకు కూలిపోయింది. మరణించిన వారిని పర్థ్(34), స్విట్జర్లాండ్ మహిళ(65), డెన్మార్క్ వ్యక్తి(60)గా గుర్తించారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రీమియర్ రొజర్ కుక్ మాట్లాడుతూ.. రాట్నెస్ట్ దీవి.. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమని తెలిపారు. ఈ ప్రాంతం ప్రజలకు అనేక సంతోషకరమైన జ్ఞాపకాలను ఇస్తుందన్నారు. అలాంటి చోట ఈ ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు.