Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్: మెదక్ జిల్లా చేగుంట నుంచి సంగారెడ్డి జిల్లా మహాదేవ్ పల్లికి కోడి పిల్లలతో వెళ్తున్న లారీ ఆదివారం ఉదయం నిజాంసాగర్ మండలం గోర్గల్ శివారు మూలమలుపు వద్ద బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న సుమారు రెండు వేల కోడి పిల్లలు మృతి చెందినట్లు లారీ డ్రైవర్ తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు.

Advertisement