అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఛత్తీస్‌గడ్‌లో గురువారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నారాయణ్‌పూర్‌ జిల్లాలోని అబూజ్‌మడ్‌ అటవీప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. భద్రతాసిబ్బంది ఈ ప్రాంతాన్ని పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకుని మిగతా మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు.