అక్షరటుడే, హైదరాబాద్: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉప్పల్ భగయత్ శిల్పరామం సమీపంలో మూర్పీ కంఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. పత్తి, ఫోంకి సంబంధించిన పర్పులు, పిల్లో, ఇతర సాఫ్ట్ వస్తువులు మంటలకు ఆహుతి అయ్యాయి. మూడు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు.