అక్షరటుడే, వెబ్ డెస్క్: చిత్తూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ను తప్పించబోయి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. 22 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాల పాలైన వారిని CMC వేలూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి తిరుచ్చికి వెళ్తుండగా.. చిత్తూరు సమీపంలోని గంగాసాగరం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి కలెక్టర్ సుమిత్‌కుమార్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.