అక్షరటుడే, జుక్కల్ : మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంసాగర్ మండలం ఆరేడు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పల్లి అశోక్(35) మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని క్షణికావేశంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.