అక్షరటుడే, బాన్సువాడ: చేపలు పట్టడానికి వెళ్లి ఓ వ్యక్తి మృత్యువాత పడిన ఘటన బీర్కూర్ లో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం పీర్ల వాగులో చేపలు పట్టడానికి వెళ్లిన సైదబోయి గల్లంతయ్యాడు. స్థానికులు వాగులో బుధవారం సైదబోయి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.