అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

0

అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణం కమల నెహ్రూ కాలనీలోని ఓ వర్క్ షాప్ ఆవరణలో సాయిలు (50) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సాయిలు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఘటన స్థలాన్ని ఎస్సై గోవింద్ పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.