అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: నగరంలో ఆదివారం సాయంత్రం యువకుడి దారుణ హత్య జరిగింది. సీఐ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ఒకటో టౌన్ పరిధిలోని గోశాల వద్ద ఆదివారం రాత్రి పలువురు యువకుల మధ్య బైక్ పార్కింగ్ విషయంలో గొడవ జరిగింది. ఒకరికిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో గైక్వాడ్ చంద్రకాంత్(22)కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుడి మృతదేహాన్ని నగరంలోని జీజీహెచ్ కు తరలించారు.