అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సీఎన్‌జీ స్కూటర్ల చరిత్రలో కొత్త అధ్యాయం ఆవిష్క్రతమైంది. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్‌ను టీవీఎస్‌ తయారు చేసింది. శనివారం భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఈ స్కూటర్‌ను ప్రదర్శించింది. జూపిటర్‌ 125 సీఎన్‌జీ పేరుతో ఈ స్కూటర్‌ను ఆవిష్కరించింది.

సీఎన్‌జీ స్కూటర్‌ ప్రత్యేకతలివే..

టీవీఎస్‌ జుపిటర్‌ 125 సీఎన్‌జీ 124.8 సీసీ, సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్‌ కూల్డ్‌ బై ఫ్యూయల్‌ ఇంజిన్‌ ఉంటుంది. 7.2 హార్స్‌ పవర్‌, 9.4ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీవీటీ ఆటోమేటెడ్‌ గేర్‌బాక్స్‌తో ఈ స్కూటర్‌ తయారు చేశారు. టాప్‌స్పీడ్‌ గంటకు 80.5 కి.మీ. రెండు ఇంధన సదుపాయాలతో వస్తున్న ఈ స్కూటర్‌లో 2 లీటర్ల పెట్రోల్‌ ట్యాంక్‌, 1.4 కిలోల సామర్థ్యం ఉన్న సీఎన్‌జీ సిలిండర్‌ ఉంటాయి. స్కూటర్‌ ముందు భాగంలో ఫ్యూయల్‌ ఫిల్టర్‌ క్యాప్‌.. సీఎన్‌జీ నాజిల్‌ సీటు కింద ఉంటుంది. మరిన్ని అధునాతన ఫీచర్లతో ఈ స్కూటర్‌ను టీవీఎస్‌ తయారుచేసింది. కానీ మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తుందనే విషయాన్ని కంపెనీ పేర్కొనలేదు. గతంలో సీఎన్‌జీ బైక్‌ను బజాజ్‌ ఆవిష్కరించింది. ప్రస్తుతం స్కూటర్‌ను టీవీఎస్‌ తీసుకొచ్చింది.