అక్షరటుడే, ఆర్మూర్ : డొంకేశ్వర్ శివారులోని వ్యవసాయ క్షేత్రాల్లో శనివారం విద్యుదాఘాతంతో నెమలి మృతి చెందింది. గమనించిన స్థానిక రైతు గోపాల్ రెడ్డి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. నందిపేట అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని నెమలిని పరిశీలించారు. అనంతరం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ రతన్ నెమలి కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. అధిక ఓల్టేజ్ తగలడంతోనే నెమలి మృతి చెందిన నిర్ధారించారు.