అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: గాలిపటం ఎగురవేస్తూ బిల్డింగ్ పైనుంచి పడి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నరేందర్ పండుగ రోజు గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.