అక్షరటుడే, బోధన్: డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. బోధన్ పట్టణంలో ఇటీవల వాహనాల తనిఖీ చేపట్టగా.. మద్యం తాగి వాహనం నడిపిన ఒకరిని పట్టుకున్నారు. బుధవారం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ వెంకట్ నారాయణ తెలిపారు.