అక్షరటుడే, బోధన్​: ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్​పై వెళ్తున్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ శివారులోని రమాకాంత్​ ఫంక్షన్​ హాల్​ వద్ద ఉదయం బీర్కూర్​ నుంచి బోధన్​కు వస్తున్న బస్సు బైక్ పై​ వస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో బైక్​పై వెళ్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.