అక్షరటుడే, భీమ్ గల్: అంబేద్కర్ జీవితంపై భీమ్ గల్ లో గురువారం నిర్వహించిన నాటక ప్రదర్శన ఆకట్టుకుంది. మాలల సంక్షేమ ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జీవిత చరిత్రను సంఘం శరణం గచ్ఛామి పేరిట ప్రదర్శించారు. అంబేద్కర్ బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, నిమ్నజాతుల హక్కుల కోసం చేసిన పోరాటాలు, రాజ్యాంగ రచనతో పాటు దేశ సేవలను ఈ నాటకంలో ప్రదర్శించారు. సమావేశంలో వ్యక్తలు మాట్లాడుతూ ఇప్పటి వరకు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ అంబేడ్కర్ జీవిత చరిత్ర నాటికను 678 ప్రదర్శనలు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో దళిత, బహుజన నాయకులు, మండల మాల సంక్షేమ ఐక్య వేదిక నాయకులు పాల్గొన్నారు.