అక్షరటుడే, ఆర్మూర్: ‘కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 66 మోసాల’పై బీజేపీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 66 మోసాలతో పాలన సాగిస్తోందంటూ బీజేపీ నాయకులు విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ కంచెట్టి గంగాధర్, బీజేపీ రాష్ట్ర నాయకుడు పల్లె గంగారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు కలిగోట గంగాధర్, అనిల్, పట్టణాధ్యక్షుడు ద్యాగ ఉదయ్, కిసాన్ మోర్చా నాయకుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి, రంగన్న, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.