అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: అధికారులు ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని ఇన్‌ఛార్జి సీపీ సింధుశర్మ సూచించారు. ఇందుకోసం టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. అవినీతి నిరోధక వారోత్సవాల్లో భాగంగా గురువారం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఇన్‌ఛార్జి సీపీ మాట్లాడుతూ అవినీతి నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, ఏసీబీ డీఎస్పీ శేఖర్‌గౌడ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.