అక్షరటుడే, కామారెడ్డి: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వారోత్సవాల్లో భాగంగా శనివారం కామారెడ్డిలో మున్సిపల్ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు వయోవృద్ధుల హక్కులు, పోషణ దినంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి ఆర్‌డీవో రంగనాథ్ రావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వృద్ధులు తీసుకునే ఆహరంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలన్నారు. జిల్లా దివ్యాంగుల సంక్షేమ అధికారి బావయ్య, తెలంగాణ సీనియర్ సిటిజెన్స్ ఫోరం అధ్యక్షుడు పున్న రాజేశ్వర్, రెడ్ క్రాస్ ఛైర్మన్ రాజన్న పాల్గొన్నారు.